'వైఎస్-రామలింగరాజు గుసగుసలు'
హైదరాబాద్: లొంగిపోవడానికి ముందురోజు సత్యం కంప్యూటర్స్ మాజీ ఛైర్మన్ రామలింగరాజు ముఖ్యమంత్రి వైఎస్‌తో మంతనాలు జరిపారని ప్రజారాజ్యం పార్టీ రాజకీయ అధికార ప్రతినిధి రామచంద్రయ్య తీవ్రంగా ఆరోపించారు. శిక్షను తప్పించుకోవడానికి ఎలా చేస్తే బాగుంటుందని చర్చించుకుని, ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే లొంగుబాటు డ్రామాను తెరపైకి తెచ్చారని విమర్శించారు.
పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. మేటాస్ ప్రాపర్టీస్, మేటాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లకు భూములు, ప్రాజెక్టులు కట్టబెట్టడంలో కాంగ్రెస్ పెద్దలకు పెద్దఎత్తున ముడుపులు ముట్టాయని, వాటి గుట్టు రట్టు కావాలంటే కేసును సెబీ, ఆర్వోసీలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని సమగ్ర విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ మొత్తం ఉదంతంలో రాజకీయ పెద్దలకు ప్రమేయం ఉందని, వారికి ముట్టాల్సింది ముట్టిందని, కేసును నీరుగార్చాలన్న ఉద్దేశంతోనే సెబీ, ఆర్వోసీలకు అప్పగించకుండా సీబీసీఐడీ విచారణకు ఆదేశించారని ఆరోపించారు. సత్యం ఉద్యోగులను ఆదుకోవచ్చని.. కానీ బెయిల్ అవుట్ రూపంలో మార్గం చూపడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications