పైలట్ ప్రతిభ : ప్రయాణికులు క్షేమం
న్యూయార్క్: అమెరికా ఎయిర్‌బస్-320 హడ్సన్ నదిలో పడిపోయింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న 148 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. రెండు పక్షులు విమానాన్ని ఢీ కొట్టడంతో పైలెట్ అత్యవసర ల్యాండింగ్‌కు సంకేతాలు పంపారు. పక్షులు ఇంజిన్లో పడిపోయినట్లు పైలెట్ అనుమానించాడు. దగ్గర్లోని చిన్న ఎయిర్‌పోర్టులో దిగేందుకు ప్రయత్నించాడు. అదీ కుదరకపోవడంతో విమానం హడ్సన్ నదిలో పడిపోయింది. వెంటనే చేరుకున్న సహాయక సిబ్బంది ప్రయాణికులను ప్రాణాలతో రక్షించారు. అక్కడ ఉష్ణోగ్రత 6 డిగ్రీలుగా ఉంది. విమానం గాలిలో ఉంటే కాలిపోయేదని పైలెట్ చెస్లీ సుల్లెన్‌బెర్గర్ అప్రమత్తంగా వ్యవహరించారని ప్రయాణికులు కొనియాడారు.












Click it and Unblock the Notifications