విజయశాంతి పార్టీ విలీనం 30న

Vijayasanthi
హైదరాబాద్: విజయశాంతి "తల్లి తెలంగాణ పార్టీ" ఈనెల 30 న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో విలీనం కానుంది. టిఆర్‌ఎస్‌లో ఈ నెల 30న తన పార్టీని విలీనం చేస్తున్న ట్లు శుక్రవారం ఆ పార్టీ వ్యవస్థాపకురాలు విజయశాంతి ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ శక్తులన్నీ ఏకమయ్యే ప్రక్రియలో భాగంగానే తను స్థాపించిన పార్టీని టిఆర్‌ఎస్‌ పార్టీలో విలీనం చేస్తున్నట్లు విజయశాంతి విలేఖర్ల సమావేశంలో వెల్లడించారు.

ఈ మేరకు నిన్న కెసిఆర్‌తో సమావేశమైన విజయశాంతి నేడు ఉమ్మడి విధాన ప్రకటన చేస్తామని చెప్పారు. అయితే జనవరి 30వ తేదీన విలీన ప్రకటన ఉంటుందని ఆమె విస్పష్ట ప్రకటన చేశారు. విజయశాంతి మనుషులకు ఎన్ని సీట్లు కేటాయించాలో ఇంకా నిర్ణయించుకోలేదని, అవన్నీ తర్వాత చర్చకు వస్తాయని కెసీఆర్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+