షబ్బీర్ ను ఘెరావ్ చేసిన గల్ఫ్ బాధితులు
నిజామాబాద్: గల్ఫ్ బాధితులకు ఉపాధి కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలన్నీ బూటకమని బాధితులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని కామారెడ్డి డివిజన్‌లోని వివిధ గ్రామాలకు చెందిన గల్ఫ్ బాధితులు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి షబ్బీర్ అలీని ఘెరావ్ చేశారు. షబ్బీర్ గల్ఫ్‌బాధితుల సమస్యలు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేఎన్నికల్లో మంత్రిని ఓడించేలా ప్రచారం నిర్వహిస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications