ఏం..ఓటర్లు బిచ్చగాళ్ళా?:జేపీ

ఈ సందర్భంగా ఆయన రాజకీయాల్లో లోక్‌సత్తా పార్టీ స్థితి గురించి వ్యాఖ్యానిస్తూ 'గంజాయి వనంలో తులసి మొక్కలు బతుకుతాయా' అని ఆవేదన చెందారు. "దేశంలో మార్పు రాకపోతే తుపాకులే శరణ్యమవుతాయి... రష్యా తరహా పరిస్థితులు ఉత్పన్నమవుతాయి'' అని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై, చరిత్ర సృష్టించిన బరాక్ ఒబామా ఆంధ్రప్రదేశ్‌లో ఏ రాజకీయ పార్టీలో చేరినా, టికెట్ దక్కేదే కాదని.. రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై విమర్శలు చేసారు.
కాంగ్రెస్-బీజేపీలకు విధానాల పరంగా తేడా లేదని చెప్పారు. నిశ్శబ్ద విప్లవానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గమే నాంది కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.అంతకు ముందు జేపీ కార్యాలయ భవనంతో పాటు వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. లోక్‌సత్తా పతాకాన్ని ఎగురవేశారు.












Click it and Unblock the Notifications