హైదరాబాద్: ఈ నెల 21 నుంచి పవన్ కల్యాణ్ పాద యాత్ర ప్రారంభం కానుంది. కరీంనగర్ జిల్లాలో మూడు రోజులపాటు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. దీనిని ఆ జిల్లాలోని కొండగట్టు వద్ద ప్రారంభించనున్నారు. అనంతరం వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. వరంగల్‌లో సభ బదులు మూడు రోజులపాటు పాదయాత్ర చేస్తే బాగుంటుందని ఆ జిల్లా నేతలు సూచిస్తున్నారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.