జైలు తిండి సరిపడని రామలింగరాజు
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజు, మేనేజింగ్ డైరెక్టర్ రామరాజులు జైల్లో చేరి శుక్రవారానికి వారం రోజులైంది. జైల్లో పెడుతున్న తిండితో ఆయాసంగా ఉందని రామలింగరాజు చెప్పడంతో అధికారులు శుక్రవారం ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీస్ వైద్యుడు నాగేశ్వర్‌రెడ్డిని పిలిపించి వైద్య పరీక్షలు జరిపించారు. ఆయన రాజును పరీక్షించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ జైల్లో ఆహారం పడకపోవటం వల్ల స్వల్ప అస్వస్థతకు గురైనట్టు తెలిపారు. రాజుకు ప్రత్యేక గది కేటాయించవలసిందిగా ఆయన న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ జరుగనుంది.
దానికి మాత్రలు రాసిచ్చినట్టు చెప్పారు. జైల్లో అన్నం తినకుండా పండ్లు తీసుకోవాలని సూచించినట్టు తెలియచేశారు. లయోలా కాలేజీలో రాజు సహ విద్యార్థి, శ్రీకాకుళం వాస్తవ్యుడు పాపారావు శుక్రవారం జైలుకు వచ్చి రామలింగరాజును పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రామలింగరాజుది ఉన్నత వ్యక్తిత్వమని, అలాంటి వ్యక్తికి ఈ పరిస్థితి దాపురించడం బాధగా ఉందన్నారు.












Click it and Unblock the Notifications