సిఐడి కస్టడీకి రామలింగరాజు

రామలింగరాజును కోర్టు ఉత్తర్వులు వెలువడిన వెంటనే తమ కస్టడీలోకి తీసుకోడానికి పోలీసులు ఈ ఉదయం నుంచే ఏర్పాట్లు చేసుకున్నారు. ఎనిమిది వేల కోట్ల రూపాయల మేరకు సత్యం కంపెనీ నిధులను రామలింగరాజు దారి మళ్ళించినట్టు ఆరోపణలు ఉన్నాయి. సెబి అధికారులు కూడా తమకు రామలింగరాజును విచారించే అవకాశం కల్పించాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరుగనుంది. సిఐడి పోలీసులు రాజు సోదరులను విచారించడానికి ఎక్కడికి తరలిస్తారో తెలియలేదు.












Click it and Unblock the Notifications