జైల్లో ప్రత్యేక సెల్ కోరుతున్న రాజు

జైల్లో ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం లేదని మొదట అనుకున్న రామలింగరాజు తనకు ప్రత్యేక సదుపాయాలు అవసరం లేదని జైలు అధికారులకు చెప్పడం, ఆ వార్తకు విస్తృత ప్రచారం రావడం తెలిసిందే. ఇప్పట్లో బెయిల్ రాదని తెలుసుకున్న రాజు ఇప్పుడు ప్రత్యేక సెల్ కోరుతున్నారు. ప్రత్యేక సెల్ అయితే మంచం, పరుపు, టేబుల్, రెండు కుర్చీలు ఉంటాయి. తన ఖర్చు మీద ఎన్ని న్యూస్ పేపర్లయినా పుస్తకాలైనా తెప్పించుకోవచ్చు. జైలు ఖర్చు మీదే ప్రతిరోజూ మెనూలో మటన్ గానీ చికెన్ గానీ అదనంగా లభిస్తుంది. రాజు కోరుకునే ఏ ప్రత్యేక కూరనైనా ఆయన స్వంత ఖర్చు మీద జైలులోనే తయారు చేసి ఇస్తారు. ఈ పిటిషన్ పై న్యాయమూర్తి సోమవారం తీర్పు ఇచ్చే అవకాశముంది.












Click it and Unblock the Notifications