హైదరాబాద్: తెలుగు దేశం పార్టీకి తమ మహిళ అధ్యక్షురాలు రోజాను ఒకే నియోజకవర్గానికి పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్త ప్రచారానికి వినియోగించుకోవాలనే ఉద్దేశంలో ఉంది.అయితే రోజా మాత్రం తాను చంద్రగిరి అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తానని పార్టీ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు సమాచారం.అప్పటికీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామంటూ చంద్రబాబు ప్రతిపాదించినా తాను ప్రత్యక్ష పోటీ ద్వారానే చట్టసభకు వస్తానని ఆమె చెప్పినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇందుకోసం ఆమెను ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తామని సూచించినట్లు సమాచారం. ఆమె మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యక్ష ఎన్నికల్లోనే పోటీ చేస్తానని, చంద్రగిరిని కేటాయించాలని కోరినట్లు తెలిసింది