హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌తో ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళం నుంచి రోడ్‌షోలు ప్రారంభించాలన్న ఉద్దేశంతో తెలుగు దేశం పార్టీ ఉన్నట్లు సమాచారం. అలాగే షో కూడా ఈనెల 29 నుంతే ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే బాలయ్య పర్యటన కూడా హిందూపురం నుంచి అదే సమయంలో ప్రారంభం కానుంది. ఆ పర్యటన వివరాలు ఇప్పటికే ఖరారయ్యాయి. అదే సమయంలో తెలంగాణలో మహాకూటమి తరఫున కానీ, సొంతంగా కానీ కొన్ని కార్యక్రమాలు, యాత్రల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. ఇలా తెదేపా రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ ఏకకాలంలో రోడ్ షోలతో సంచలన ప్రచారం చేయాలన్న వ్యూహంతో ఉంది.