న్యూఢిల్లీ: ఎయిమ్స్ నుంచి నిన్న డిశ్ఛార్జి అయిన ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం తిరిగి ఆసుపత్రిలో చేరారు.గుండెలో నొప్పి రావటంతో బుధవారం ఆయన ఎయిమ్స్‌లో చేరారు. ఆయనకు చికిత్స చేసిన డాక్టర్లు అనంతరం అన్ని పరీక్షలు నిర్వహించారు. గుండె కవాటాల్లో రక్తం గడ్డ కట్టి ఉండడంతో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. రేపు ఆయనకు ఆపరేషన్ జరుగుతుందని డాక్టర్లు తెలిపారు. ఆనంతరం ఆయన 4 వారాలపాటు విశ్రాంతి తీసుకోవలసి ఉన్నందున ఆ సమయంలో మంత్రివర్గ సమావేశాల కార్యక్రమాల నిర్వహణ తదితర పనులను విదేశాంగమంత్రి ప్రణబ్ ముఖర్జీ నిర్వహిస్తారు.