సత్యంపై ఇనకంటాక్స్ విచారణ
ముంబై: సత్యం కుంభకోణంపై ఆదాయపు పన్ను శాఖ విచారణ ప్రారంభించింది. మూలంలో పన్ను మినహాయింపులు, బినామీ ఖాతాల మీద ఈ శాఖ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. "సత్యం కేసులో మేం స్వతంత్ర విచారణ జరుపుతున్నాం" అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ ఎన్ బి సింగ్ విలేకరులకు మంగళవారం చెప్పారు.
విచారణ పూర్తి కావడానికి ఎంత కాలం పడుతుందని విలేకరులు ప్రశ్నించగా, నిర్ణీత వ్యవధి అంటూ లేదని, అయితే చాలా త్వరగా వేగంగా విచారణ జరుగుతుందని ఆయన చెప్పారు. సత్యం కుంభకోణంపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు, సెబీ అధికారులు, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దర్యాప్తు జరుపుతున్నారు. రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు, సిఎఫ్ వో శ్రీనివాస్ వడ్లమాని, కంపెనీకి సంబంధించిన ఇద్దరు ఆడిటర్లు ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications