రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 5గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారంతా మహిళలే. యర్రగొండపాలెం మండలం గురిజేపల్లి సమీపంలో ఈ సంఘటన జరిగింది. దొనకొండ మండలం కట్టకింద పల్లెకు చెందిన 20 మంది కూలీలు గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతంలో వరినాట్లు వేసేందుకు గత రాత్రి లారీలో బయలుదేరారు. గురిజేపల్లి మలుపువద్ద లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో 5గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 8మందిని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications