హైదరాబాద్: పొత్తులపై తెరాసకు చెప్పాల్సిందంతా చెప్పామని ఇక తేల్చుకోవలసింది వారేనని పీఆర్పీ అధినేత చిరంజీవి అన్నారు. వీలైనన్ని ఎక్కువ సీట్లు తెరాసకు ఇచ్చేందుకు ఇప్పటికే అంగీకరించామని, ఇక బంతి వారి కోర్టులోనే ఉందని అన్నారు. నిన్న రాత్రి తెరాసతో చర్చలు జరిపినట్లు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. మహాత్ముని వర్థంతి సందర్భంగా ఆయన లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. నెల్సన్ మండేలా వంటి నేతలకు ఆదర్శమైన గాంధీ గురించి నేటి రాజకీయవేత్తలకు పట్టటం లేదన్నారు.