క్రీస్తు రాజ్యం కావాలి: చిరంజీవి

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..ఎస్సీ వర్గానికి చెందినవారు క్రైస్తవ మతం స్వీకరించినప్పుడు వారిని ప్రభుత్వం బి.సి.(సి)లుగా గుర్తిస్తోందని, అలాకాకుండా ఎస్సీలుగానే పరిగణించేందుకు నిపుణులతో కూడిన కమిటీని నియమించి, సాధ్యాసాధ్యాలను పరిశీలింపజేస్తామని హామీ ఇచ్చారు.
ఆస్తుల పరిరక్షణకు హిందువులకు దేవాదాయ శాఖ, ముస్లింలకు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఆస్తులున్న క్రైస్తవ మిషనరీలకు ఏ సంస్థా లేదు. ప్రజారాజ్యం అధికారంలోకి రాగానే బోర్డు ఏర్పాటుకు ప్రయత్నిస్తుంది. ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లడానికి ప్రభుత్వం సాయం చేస్తున్నట్లే క్రైస్తవులు జెరూసలెం యాత్రకు ఆర్థిక సహాయం చేస్తామన్నారు. క్రైస్తవులపై దాడులు జరగడం దారుణమని, వాటిని నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు.












Click it and Unblock the Notifications