బాలికపై అత్యాచారం కేసులో ఉరిశిక్ష
విజయనగరం: మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఓ వ్యక్తికి కోర్టు ఉరిశిక్ష విధించింది. విజయనగరం జిల్లాకు చెందిన బత్తుల శేషయ్యను నిందితుడిగా పేర్కొంటూ జిల్లా సెషన్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది క్రితం శేషయ్య తన ఇంటి వద్ద ఆడుకుంటున్న ఓ బాలికను మాయమాటలు చెప్పి అత్యాచారం జరిపి అనంతరం ఆ బాలికను హత్య చేశాడు. ఏడాది పాటు నిందితుడిని విచారించిన కోర్టు నేడు ఉరి శిక్ష విధించింది.
విజయనగరం జిల్లా ధర్మపురి గ్రామంలో గత ఏడాది ఫిబ్రవరి 25న గీత అనే నాలుగేళ్ల బాలికను ఆమె సమీప బంధువు బత్తుల శేషయ్య కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడి నీళ్లకుండీలో వేసి చంపేశాడు. సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పి.జగన్నాథరావు శేషయ్యకు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.












Click it and Unblock the Notifications