విశాఖలో భారీ డ్రగ్స్ రాకెట్
విశాఖపట్నం: విశాఖ నగరంలో గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ రాకెట్‌ను డిఆర్‌ఐ అధికారులు చేధించారు. నైజీరియన్ దేశస్థుడు బెంజిమెన్‌ను ఆరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 2.2 కోట్ల రూపాయల విలువ చేసే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని డ్రగ్స్ రాకెట్ నడుపుతున్నట్లు తెలియవచ్చింది. బెంజిమన్‌ను రెండు రోజుల క్రితమే అరెస్టు చేసి హైదరాబాద్, ఫిలింనగర్‌లో రెవెన్యూ ఇంటిలిజెన్స్ కార్యాలయంలో అధికారులు విచారిస్తున్నారు. శుక్రవారం కోర్టులో హాజరుపరుస్తారు.












Click it and Unblock the Notifications