అబ్బే అది..ఆదికేశవులపై కాదు: జానారెడ్డి

హైదరాబాద్‌లో బాబా రాందేవ్ నిర్వహిస్తున్న యోగా కార్యక్రమానికి ఆయన ఈరోజు ఉదయం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాదినుంచి మన దేశంలో యోగాకు ఎంతో ప్రాధాన్యం ఉందని రాష్ట్ర హోంమంత్రి జానారెడ్డి అన్నారు. యోగా అభ్యాసం చేశారు. యోగులనుంచి పుణికిపుచ్చుకున్న యోగా ఆరోగ్యానికి పూర్తి స్వస్థత చేకూరుస్తుందని అన్నారు. యోగా భారతీయ సంస్కృతిలో భాగమని అన్నారు.
నిన్న ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ టీటీడీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో యోగా తరగతులు నిర్వహిస్తున్న ఆయన ఈరోజు శిక్షణలో సమాజం తీరుపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు స్వాతంత్య్రం రాగానే మధ్య అనేదే ఉండకూడదని మహాత్మాగాంధీ భావించారని అందుకు విరుద్ధంగా ప్రభుత్వాలే మద్యం అమ్ముతున్నాయన్నారు. ధార్మికసంస్థ అయిన టీటీడీకి ఛైర్మన్‌గా మద్యం వ్యాపారి ఆదికేశవులునాయుడును ప్రభుత్వం నియమించటం సిగ్గుచేటన్నారు. ప్రజలను చంపే మద్యాన్ని అమ్మే వ్యక్తికి దైవ సన్నిధిలో ఉన్నతస్థానం కల్పించటం శోచనీయమన్నారు.












Click it and Unblock the Notifications