హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్‌లో జరిగిన అవకతవకలపై సంస్థ మాజీ ఛైర్మన్ రామలింగరాజును ప్రశ్నించేందుకు అనుమతించాలంటూ సెబీ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ వచ్చే నెల 9వ తేదీకి వాయిదాపడింది. ఇదే విషయమై చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ ద్వారా రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజుకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.