చిరంజీవివి వెధవ..: నన్నపనేని
హైదరాబాద్: చిరంజీవి వెధవ రాజకీయాలకు పాల్పడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి ధ్వజమెత్తారు. ఓ ప్రక్క ఎన్టీఆర్‌ను ప్రస్తుతిస్తూనే ఆయన స్థాపించిన పార్టీని విమర్శించడం చేస్తున్నారని ఆమె అన్నారు. గురువారంఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో ఆమె మాట్లాడారు. బాలకృష్ణ పర్యటన ప్రారంభంలోనే ప్రజాదరణ బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. బాబు, బాలయ్యల సభలకు వస్తున్న జనాన్ని చూసి పీఆర్పీలో గుబులు పుడుతోందని వ్యాఖ్యానించారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసే అర్హత, హక్కు చిరంజీవికి లేవన్నారు. పీఆర్పీ నేతలకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు దక్కవని ఆమె ఆవేశంగా అన్నారు.












Click it and Unblock the Notifications