చెన్నై: అడ్వాన్స్ తీసుకుని, తిరిగి ఇవ్వకుండా నిర్మాతను ఇబ్బంది పెట్టిన నయనతారను తమిళసినీ రంగం బహిష్కరించింది. సుభాష్‌చంద్రబోస్ అనే నిర్మాత ఓ సినిమాకుగాను ఆమెకు 25 లక్షల అడ్వాన్స్ ఇచ్చాడు. అనివార్యకారణాల వల్ల సినిమా తీయలేకపోతున్నట్లు, అడ్వాన్స్‌ను వాపస్ చేయాల్సిందిగా నిర్మాత నయనతారను కోరగా ఆమె అందుకు నిరాకరించింది. దీంతో నయనతారపై ఆ నిర్మాత సినీ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. ఆమెను తమిళసినీరంగం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా కోసం నిర్మాతకు డేట్స్ ఇచ్చి తాను నష్టపోయినట్లు నయనతార వాదిస్తోంది.