సీట్లు ఇన్నని చెప్పలేం..చిరు

ఈ సమావేశానికి ముందు వివిధ కులాలకు చెందిన నేతలు చిరంజీవితో సమావేశమై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు ప్రతి కులానికీ కనీస మొత్తంలో సీట్లు కేటాయించాలని కోరారు. నేతల కోరికను సున్నితంగా తిరస్కరించిన చిరంజీవి మాట్లాడుతూ ప్రతి కులానికి నిర్థిష్ట సంఖ్యలో సీట్లు కేటాయించడం జరిగే విషయం కాదన్నారు.
అయితే సీట్లు కోరుతున్న వర్గాల మనోభావాలను, ఆసక్తిని, మనోవేదనను తాను అర్థం చేసుకున్నానని వచ్చే ఎన్నికల్లో వారికి న్యాయం చేయడానికే ప్రయత్నిస్తానని ఆయన పేర్కొన్నారు. అలాగే లక్ష కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి కేవలం రూ.ఐదువందల కోట్లు కేటాయించడం ఏంటని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications