ముదిరిన సీపీఎం గొడవ..ఐదుగురు మృతి
కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో తృణముల్ కాంగ్రెస్, సీపీఎం పార్టీల మధ్య మరోసారి ఘర్షణలు ఏర్పడ్డాయి. ఈ ఘటన వల్ల సీపీఎంకు చెందిన ఐదురుగు కార్యకర్తలు మృతి చెందగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారు.పశ్చిమ బెంగాల్‌లోని బిర్భూం జిల్లాలోని పాపురీ గ్రామంలో రెండు వర్గాలకు ఈరోజు తెల్లవారుజామున ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు బాంబులు, తుపాకులతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. తమ పార్టీకి గట్టి మద్దతుగా ఉన్న ఈ గ్రామంపై సీపీఎం కార్యకర్తలు అకారణంగా దాడి చేశారనీ, ఈ ఘర్షణల్లో తమ పార్టీ కార్యకర్తలు ఐదుగురు చనిపోయారని తృణమూల్ కాంగ్రెస్ కార్యదర్శి అనూప్‌బ్రాతా మండల్ చెబుతున్నారు. జిల్లా ఎస్పీ లక్ష్మీ నారాయణ మీనా రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.












Click it and Unblock the Notifications