హైదరాబాద్: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ నెల 9న హైదరాబాద్ రానున్నారు. ఆరోజు సాయంత్రం ఆయన బేగంపేట విమానాశ్రయం చేరుకుంటారు. 10న హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే 'మ్యాప్ వరల్డ్ ఫోరమ్' సదస్సును ప్రారంభిస్తారు. తర్వాత మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం విద్యార్థులతో ముచ్చటిస్తారు. అదేరోజు సాయంత్రం బాగ్‌లింగంపల్లిలోని కామ్రేడ్ హనుమంతరావు భవన్‌లో సంపాదకులతో సమావేశమవుతారు. అనంతరం ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.