చిరు పార్టీపై బ్రాహ్మణుల గుర్రు
హైదరాబాద్: చిరంజీవి ప్రజారాజ్యం పార్టీపై బ్రాహ్మణ సంఘం తీవ్రంగా ధ్వజమెత్తింది. ఢిల్లీలో బ్రాహ్మణులు రిక్షా తొక్కుకుంటున్నారని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యపై బ్రాహ్మణ సంఘం నాయకులు ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మండిపడ్డారు. ఓట్ల కోసం బ్రాహ్మణులను కించపరిచే దిగజారుడు రాజకీయాలకు పాల్పడిన ప్రజారాజ్యం పార్టీకి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని వారన్నారు.
ఢిల్లీలో వివిధ సంఘాలు సర్వే చేశాయని, ఢిల్లీలో రిక్షా తొక్కుకునే బ్రాహ్మణులెవరూ లేరని వారన్నారు. ఢిల్లీలో 50 బ్రాహ్మణులు శాసనసభ్యులుగా ఉన్నారని, బ్రాహ్మణ కులానికి చెందిన ముఖ్యమంత్రి ఉన్నారని వారన్నారు.












Click it and Unblock the Notifications
