రోజాకు రామ్మూర్తి నాయుడి మద్దతు
తిరుపతి : చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించిన రోజాకు పూర్తి మద్దతునిస్తున్నట్టు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు తెలపారు. చంద్రగిరి టెక్కెట్టు కోసం తీవ్రంగా ప్రయత్నించిన రామ్మూర్తినాయుడు మొదట్లో రోజా పర్యటనకు సహకరించలేదు. దీంతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అందర్ని పిలిచి సర్దుబాటు చేశారు. రోజాతో కలిసి ఆయన ఆదివారంనాడు వేదికను కూడా పంచుకున్నారు.
రామ్మూర్తి నాయుడికి చంద్రగిరి తెలుగుదేశం టికెట్ లభించవచ్చుననే వార్తలు రావడంతో గతంలో రోజా అలిగారు కూడా. చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో ఆమె తన అలకను మానుకున్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఆమె రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవిపై, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై ఆమె విమర్శల శరపరంపరలు కురిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications
