కేరళలో 11 మంది ఆంధ్రుల మృతి
కొట్టాయం: కేరళ రాష్ట్రంలో మంగళవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. వారిని చికిత్స నిమిత్తం కొట్టాయంలోని వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. కేరళలోని ఎలిమేరి వద్ద మంగళవారం తెల్లవారు జామున ఐదు గంటల ప్రాంతంలో పంబా నది లోయలో పడింది. మృతుల్లో 9 మంది మహిళలున్నట్లు సమాచారం.
ప్రయాణికులంతా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందినవారని తెలుస్తోంది. ప్రమాదం సంభవించిన సమయంలో బస్సులో 50 మంది దాకా ఉన్నట్లు తెలుస్తోంది. శబమరిలై తీర్థయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెలుతురు సరిగా లేనందున, రోడ్డు ఇరుకుగా ఉండడం వల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు. మృతుల కుటుంబాలకు శబరిమలై ఆలయ కమిటీ లక్ష రూపాయలేసి నష్టపరిహారం ప్రకటించింది.












Click it and Unblock the Notifications