అది పాలకొల్లు బస్సు: హెల్ప్ లైన్
హైదరాబాద్: కేరళలో ప్రమాదానికి గురైన బస్సు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని లక్ష్మీ ట్రావెల్స్ కు చెందింది. ప్రయాణికులు 18 రోజుల దక్షిణ భారత యాత్ర కోసం ఈ నెల 11వ తేదీన పాలకొల్లు నుంచి బయలు దేరారు. కన్యాకుమారి, శ్రీశైలం, మహానంది, రామేశ్వరం వంటి తీర్థప్రదేశాల సందర్శనకు వారు బయలు దేరారు. ఆ రోజు లక్ష్మీ ట్రావెల్స్ కు చెందిన నాలుగు బస్సులు దక్షిణ భారత యాత్రకు బయలుదేరాయి. వీటిలో ఏ బస్సు ప్రమాదానికి గురైందనే విషయం తెలియడం లేదు.
బస్సు ప్రమాదంలో మరణించిన యాత్రికులు దువ్వ, తణుకు, వేల్పూరు, కట్టవపాడు, ద్వారకా తిరుమలకు చెందినవారిగా భావిస్తున్నారు. అయితే వారు ఏ గ్రామానికి చెందినవారనేది నిర్దిష్టంగా తెలియడం లేదు. బస్సు ప్రమాదంలో మరణించిన 11 మంది మృతుల్లో వి.లక్ష్మినర్సు, మంగాయమ్మ, వెంకాయమ్మ, సూర్యకాంతం, రత్తమ్మ, శశి, పార్వతి, సత్యనారాయణ, శేషారత్నం, లక్ష్మి ఉన్నట్లు సమాచారం.
హెల్ప్ లైన్: 09447056334












Click it and Unblock the Notifications