రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి
బళ్లారి: కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి వద్ద గురువారం జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. ప్రయాణీకులతో వెళుతున్న ఓ వ్యాను తెల్లవారుజామున అదుపు తప్పి ఓ చెట్టును ఢీకొంది. బళ్లారి సమీపంలోని వేణివీరాపురం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. దీంతో 15మంది మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు. మృతులంతా కర్ణాటకలోని గడగ్ జిల్లా వాసులుగా తెలుస్తోంది. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక బాలుడు ఉన్నారు.












Click it and Unblock the Notifications