న్యూఢిల్లీ: ముంబయిపై పాక్ ఉగ్రవాదుల దాడిపై పాకిస్థాన్ ఆ దేశ దర్యాప్తు సంస్థలు చేస్తున్న విచారణలో అవసరమైన మేరకు భారత్ సమాచారాన్ని అందిస్తుందని కేంద్రవిదేశాంగమంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. అయితే పాక్‌తో కలసి సంయుక్త విచారణ ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చారు. దాడుల్లో పాక్‌జాతీయల ప్రమేయంపై కూడా సమాచారాన్ని పాక్‌కు అందించామని ఆయన తెలిపారు.