ఇస్లామాబాద్: ప్రణబ్ సహకరించక పోవడం వల్లనే ముంబై దాడుల దర్యాప్తులో పురోగతి కనిపించడం లేదని, అసలు ఈ దాడుల వెనుక తమకెన్నో సందేహాలున్నాయని స్వయంగా గిలానీ మీడియాతో అన్నారు. అలాగే ముంబై దాడుల దర్యాప్తులో ప్రణబ్ ముఖర్జీ సరిగా సహకరించడం లేదని పాక్ అధికారులులో మీడియా పదే పదే చెప్తున్నారు. పాక్ మీడియా కూడా వీటిని ప్రత్యేక కథనాలుగా తయారుచేసి ప్రసారం చేస్తున్నాయి. ముంబై దాడులపై ప్రత్యేక రావల్పిండి కోర్టును ఏర్పాటు చేసినప్పటికీ, తాము అడిగిన ముప్ఫై ప్రశ్నలకు భారత్ నుండి ఇప్పటి వరకూ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని గిలానీ ఆరోపించారు.