హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ పర్యటన మార్చి 12వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో..రోడ్ షో షెడ్యూలు, పర్యటనలో తీసుకోవలసిన జాగ్రత్తలు తదితర అంశాలపై చంద్రబాబుతో చర్చించారు. బాబు నివాసంలో సుమారు అర గంటపాటు వీరిద్దరూ చర్చలు జరిగాయి. అంతకు ముందు టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావుతో సుమారు రెండు గంటలసేపు జూనియర్ ఎన్టీఆర్ చర్చించారు. మరోవైపు బాలకృష్ణ రెండో విడత పర్యటనకు రంగం సిద్ధమవుతోంది. ఇలా విరామంతో విడతలుగా ప్రజల్లోకి వెళ్తున్న బాలయ్య..ఏప్రిల్ రెండో తేదీనుంచి నిర్విరామంగా ఎన్నికల ప్రచారం చేయనున్నట్టు తెలిసింది. ఎన్టీఆర్ కూడా ఎన్నికల ప్రక్రియ ముగిసే సమయానికి అన్ని జిల్లాలనూ చుట్టి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.