తుపాకీ పట్టుకోవాలనుకున్నా..పవన్

Pawan Kalyan
హైదరాబాద్‌: సమాజంలో అక్రమాలు, అన్యాయాలు చూసి ఒక దశలో అడవుల్లోకెళ్లి తుపాకీ పట్టాలన్న భావన కలిగిందని యువరాజ్యం అధినేత పవన్‌ కళ్యాణ్‌ తెలిపారు. తాను పెరిగిన వాతావరణం కారణంగా..కానిస్టేబుళ్ల కష్టాలు కూడా తెలిశాయన్నారు. తుపాకీ పట్టుకొని ఒకడు మరొకడిపై ఎందుకు దాడి చేస్తారు? అన్న విషయాలపై తాను ఆలోచించేవాడినని పవన్‌ చెప్పారు. ఒకదశలో విప్లవ పార్టీల పట్ల ఆకర్షితుడ్ని అయ్యానని చెప్పారు. ప్రజా సమస్యల్ని ప్రభుత్వాలు మరిస్తే ఉద్యమాలు...విప్లవాలు పుడతాయన్నారు. 'మాజీ ఉద్యమకారుల రాష్ట్ర సదస్సు' పేరుతో పీఆర్పీకి మద్దతుగా మాజీ నక్సల్స్‌ ఎల్బీనగర్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో పవన్‌ మాట్లాడారు.

హంతకులు స్వేచ్ఛగా తిరుగుతుంటే.. మార్పు కోసం ప్రయత్నించే ఉద్యమకారులు అడవుల్లో దోమకాటుకు కూడా మరణిస్తూ ఉంటారని పవన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రరాపా అధికారంలోకి వస్తే నక్సల్స్‌పై నమోదైన కేసుల్ని ఎత్తివేసే విషయంలో పోలీసు అధికారులతో చర్చిస్తామన్నారు. చేగువేరా తనకు ఎంతో స్ఫూర్తి కలిగించిన వ్యక్తి అని పవన్‌ చెప్పారు.

అలాగే అరవై ఏళ్ల దోపిడీ విధానాన్ని పీఆర్పీ వచ్చి నెల రోజుల్లో మాయం చేయలేదు. అన్ని పార్టీల్లా నేను మీకు మాయమాటలు చెప్పలేను. మాజీ ఉద్యమకారులపై కేసులు ఎత్తేస్తామని ఒక్క మాటలో చెప్పొచ్చు. కానీ నేను అలా చెప్పలేను. అయితే, కేసులు ఎత్తేసే దిశగా పోలీసు శాఖతో చర్చించి, మార్గం సుగమం చేస్తామని చెప్పగలను. పునరావాసం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తాం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+