ఎల్లుండి సోనియా రాష్ట్ర పర్యటన

అభ్యర్థుల ఎంపిక కసరత్తులో కీలకమైన ఎన్నికల కమిటీ మార్చి 2, 3 తేదీల్లో గాంధీభవన్లో సమావేశం కానుంది. ఆ రెండు రోజుల్లోనే 294 అసెంబ్లీ, 42 లోక్‌సభ స్థానాలకు సంబంధించి ప్రాథమిక జాబితాను సిద్ధం చేస్తుంది. పీసీసీ అధ్యక్షుడు డీఎస్, వైఎస్ సమక్షంలో జరిగే ఈ భేటీకి వీరప్ప మొయిలీ, కురియన్, కృష్ణకుమార్ హాజరవుతారని భావిస్తున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి రెండు మూడు పేర్లతో జాబితా రూపొందిస్తారు. అనంతరం ఢిల్లీలో మార్చి ఐదారు తేదీల్లో జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీకి దానిని సమర్పించాల్సి ఉంది. ఇప్పటికే ఉన్న అంచనా ప్రకారం.. నెలాఖరులోపు ఎన్నికల తేదీ లు ప్రకటిస్తే..మార్చి ఆరో తేదీనాటికి కాంగ్రెస్ తన తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications