కాంగ్రెస్ అండతోనే దాడులు: కారెం
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు చేస్తున్నదని మాలమహానాడు అధ్యక్షుడు కారెం శివాజీ ఆరోపించారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ బస్సులను దగ్ధం చేస్తేనో, ప్రభుత్వ ఆస్తులను తగలబెడితేనో, ప్రజాప్రతినిధులను అడ్డుకుంటేనో ఎస్సీల వర్గీకరణ జరగదని చెప్పుకొచ్చాచరు. మొన్నటివరకు చంద్రబాబును విమర్శించిన మంద కృష్ణ ఆయనను కలిసి కన్నీరు పెట్టుకోవడం తమకే బాధేస్తుందని అన్నారు. అలాగే తన అనుచరుడు ఎం.కృపాకర్ కు అమలాపురం ఎంపీ టికెట్ కోరేందుకు బాబును కలిసారన్నారు.












Click it and Unblock the Notifications