హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల గుర్తు కోసం ఇబ్బందిని గమనించి కేంద్ర మంత్రి శరద్ పవార్‌కు ఎన్నికల గుర్తుపై చిరుకు ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల కమీషన్ పీఆర్పీకి ఒకే ఎన్నికల గుర్తు ఇవ్వడానికి నిరాకరించినందున తమ ఎన్నికల గుర్తు గడియారంపై పీఆర్పీ పోటీ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని శరద్ పవార్ తెలిపారు. ఈ ప్రతిపాదనతో అటు కేంద్రంతో పాటు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రధాని పదవిని ఆశిస్తున్న శరద్ పవార్‌తో తాజా ప్రతిపాదనతో రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి చిరంజీవి ఏ విధంగా ప్రతిస్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక వేళ శరద్ పవార్‌తో పొత్తు కుదిరి పీఆర్పీ ఒకే ఎన్నికల చిహ్నం లభిస్తే ఇటు రాష్ట్రంతో పాటు కేంద్రరాజకీయాల్లోనూ చురుకైన పాత్రను పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.