కొత్తగూడెం: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ పై ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆమె అభినందించారు. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, రాష్ట్రంలో వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే రాష్ట్రంలో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని ఆ పార్టీ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ అన్నారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన గిరిజన సదస్సులో సోనియా మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి వై.ఎస్ నేతృత్వంలో ఈ రాష్టంలో సంపూర్ణంగా అమలు చేశారని పేర్కొన్నారు. ఇందిరమ్మ పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.