హైదరాబాద్: నిర్మాణంలో ఉన్న తన సినిమా "మిత్రుడు" షూటింగ్ పూర్తి కావడంతో బాలయ్య ఇకపై పూర్తి స్థాయిలో రాజకీయ కసరత్తు చేయబోతున్నారు. వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో రెండో దశ పర్యటనకు వెళ్లనున్న బాలయ్య అందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం బాలయ్య తన నివాసంలో టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహనరావు, నిర్మాత మాగంటి గోపీనాథ్‌లతో విడివిడిగా సమావేశమయ్యారు. మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా వివిధ జిల్లాల్లో పర్యటించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.