హైదరాబాద్: చిరంజీవి నిజ జీవితంలో కూడా పెద్ద నటుడని, తనపై శోభారాణి చేత బూతులు తిట్టించింది చిరంజీవేనని సినీనటి, తెలుగుమహిళ అధ్యక్షురాలు రోజా వ్యాఖ్యానించారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ లను వదిలేది లేదని ఆమె అన్నారు. "రోజా నిర్మాతల కుమారులను మభ్యపెట్టి వాళ్ళతో తెగతిరిగి కోట్లు కొట్టేసింది" అని మహిళారాజ్యం నాయకురాలు శోభారాణి చేసిన ప్రకటన మీద ప్రజారాజ్యం అధికార ప్రతినిధి విచారం వ్యక్తం చేశారు. చిరంజీవి కూడా శోభారాణిని నిన్ననే వారించారు.
రోజా మీద శోభారాణి ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మరో వైపు రోజా వ్యాఖ్యల మీద కూడా ప్రజారాజ్యం కార్యకర్తలు నిరస్న వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.