రైల్వే స్టేషన్ ను పేల్చేసిన మావోయిస్టులు
రూర్కెలా: ఒరిస్సాలోని సుందర్‌గఢ్ రైల్వేస్టేషన్‌ను శనివారం ఉదయం మావోయిస్టులు పేల్చివేసి విధ్వంసం సృష్టించారు. అనంతరం ఇద్దరు రైల్వే ఉద్యోగులను ఎత్తుకుపోయారు. అత్యంత శక్తివంతమైన మందుపాతర్లను అమర్చి పేల్చివేశారు. దాంతో ఆ మార్గంలో ప్రయాణించే రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇటీవల ఇద్దరు మావోయిస్టులను పోలీసులు కాల్చివేతకు నిరసనగా ఈ చర్యకు పాల్పడినట్లు తెలియవచ్చింది. కాగా ఐదు రాష్ట్రాల్లో ఒక్క రోజు బంద్‌కు పిలిపిచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఆయా రాష్ట్రాల్లో (ఒరిస్సా, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, వెస్ట్ బెంగాల్) బంద్ జరుగుతోంది.












Click it and Unblock the Notifications