రోజా ఊరకుక్క: శోభారాణి
మహిళా రాజ్యం అధ్యక్షురాలు శోభారాణి హైదరాబాద్‌లో శుక్రవారం విలేఖరుల సమావేశం పెట్టి మరీ తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజాపై నిప్పులు చెరిగారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న రోజా దీనికి దీటుగా బదులిచ్చారు. శోభారాణి వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే....
"ప్రజారాజ్యాన్ని విమర్శిస్తే ఆ పార్టీ ఆదర్శంగా తీసుకున్న గాంధీ, అంబేద్కర్, మదర్ థెరిస్సా, జ్యోతిరావు పూలేలను విమర్శించినట్టే. పీఆర్పీని పదే పదే విమర్శిస్తే రోజాకు దేహశుద్ధి తప్పదు. ఆమెను చంద్రబాబునాయుడు ఊరకుక్కలా వదిలారు. ఆమె చీకటి జీవితం గురించి రాస్తే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది.
సినిమాల్లో అశ్లీలంగా నటించి నిర్మాతల కుమారులను ప్రేమలో పడేసి వారిని మోసం చేసింది. చివరకు సెల్వమణిని కూడా అలాగే మోసంచేసి పెళ్లాడింది. సినిమాల్లో నుంచి బయటకు వచ్చినా వృత్తిపరమైన అసహ్యకర ధోరణిని రోజా వీడలేదు. గతంలో రోజాపై చెక్‌బౌన్స్ కేసులున్నాయి. ఆమె 420 అని కోర్టులు కూడా చెప్పాయి. అలాంటి వారిని తెలుగు మహిళ అధ్యక్షురాలిగా నియమించడమేమిటి? బెల్టు షాపుల గురించి మాట్లాడే రోజా.. తన సోదరులు నిర్వహిస్తున్నవేమిటో చెప్పాలి.
మేము తలచుకుంటే 24 గంటల్లో రోజాను బజారులో నిలబెట్టగలం. రోజాకు మేం సలహా ఇస్తున్నాం! ఆమె మళ్లీ సినిమాల్లోకి వెళ్లి క్లబ్ డ్యాన్స్ లేదా వ్యాంప్ క్యారెక్టర్లు వేసుకుంటే బాగుంటుంది. ఇకనైనా నోరు మూయకపోతే ఆమె నటించిన అశ్లీల దృశ్యాలను పోస్టర్లుగా వేస్తాం. 'బారు, దర్బారు' అని కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు రోజాకే సరిపోతాయి.
పులివెందులలో పోటీ చేయాలని సవాల్ విసురుతున్న రోజా కాంగ్రెస్ వారితో కుమ్మక్కయ్యారా? పార్టీ ఆదేశిస్తే నాతో సహా పార్టీ కార్యకర్తలెవరైనా పులివెందులలోగానీ, రోజాపైగానీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. రోజాను తక్షణం పార్టీనుంచి బహిష్కరించకపోతే బాబు ఇంటిముందు మహిళారాజ్యం ధర్నా చేస్తుంది."












Click it and Unblock the Notifications