ఎంబీఏ విద్యార్ధి యాక్సిడెంట్ లో మృతి
హైదరాబాద్: హైదరాబాద్‌లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంబిఎ విద్యార్థి మృతి చెందాడు. బండ్లగూడ సమీపంలో ఓ లారీ ఎంబిఎ విద్యార్థి రూపేష్‌ను ఢీకొంది. విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. దాంతో ఆగ్రహించిన విద్యార్ధులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications