హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తల ఆందోళనలు తీవ్రతరం కావటంతో దళిత ప్రజాప్రతినిధులు ఈరోజు సీఎంను కలిశారు. కోనేరు రంగారావు, మల్లు రవి, నంది ఎల్లయ్య, మందా జగన్నాథం, రాజేశ్వరరావు తదితరులు సీఎంను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎస్సీల వర్గీకరణను కేంద్ర క్యాబినెట్ త్వరగా ఆమోదించేలా చూడాలని వారు ఆయనను కోరారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించారని వారు అనంతరం మీడియాకు తెలిపారు.