గుర్తుపై మళ్ళీ కోర్టుకెళ్ళనున్న చిరు

ఉమ్మడి గుర్తు రాకపోతే ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా నష్టపోతుందని ప్రజారాజ్యం నాయకులు ఆందోళన చెందుతున్నారు. తమ గుర్తుపై ప్రజారాజ్యం పోటీ చేసుకోవచ్చని ఎన్ సిపి అధినేత, కేంద్ర మంత్రి శరద్ పవార్ ఆఫర్ చేయడం, దాని మీద సీనియర్లతో చర్చించిన తర్వాత చిరంజీవి ఆ ప్రతిపాదనను తిరస్కరించడం జరిగిపోయాయి. ఎన్ని న్యాయపోరాటాలు చేసినా ఉమ్మడి గుర్తు రాకపోతే చిరంజీవి పార్టీ జయలలిత నాయకత్వంలోని ఎఐడిఎంకె గుర్తును గానీ, ములాయం సింగ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ వాది పార్టీ గుర్తును కానీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎస్పీ గుర్తు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిలే కావడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తుతాయి.












Click it and Unblock the Notifications