చిరు పార్టీకి బుర్ర చెడింది: కెసీఅర్
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీకి మతి చెడిందని, తెలంగాణపై ఆ పార్టీ అడ్డదిడ్డంగా మాట్లాడుతోందని దేవేందర్ గౌడ్ వంటి నాయకులు ఆ పార్టీలో ఎలా ఎందుకు చేరారో అర్ధం కావడం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు గురువారం విమర్శించారు. తెలంగాణ వాదానికి అనుకూలంగా కనిపిస్తూనే తెలంగాణ నాయకులకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ విమర్శలు చేయడంతో చంద్రశేఖరరావు నేడు పీఅర్ పి పై నోరు విప్పాల్సి వచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
బిజెపితో ప్రజారాజ్యం పొత్తు పెట్టుకునే అవకాశాలు కన్పిస్తున్నందువల్ల చంద్రశేఖరరావు కలవరానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. ప్రజారాజ్యం, బిజెపి కలిస్తే తెలంగాణలో ఓట్లు బాగా చీలుతాయన్న అభిప్రాయం ఉంది.












Click it and Unblock the Notifications