రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
మెదక్: మెదక్ జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడి కక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నారాయణఖేడ్ మండలం, నిజాంపేట్ సమీపంలో ట్రాక్టర్-ఆటో ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications