హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ రోడ్ షోలు సూపర్ హిట్ అవుతుండడంతో ప్రతి వ్యూహం రచించడానికి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఒక రోజు ముందుగానే ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా స్క్రీనింగ్ సమావేశానికి ఢిల్లీ వెళ్ళిన రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ లు శనివారం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో డి.ఎస్ మాట్లాడుతూ శుక్రవారం అర్ధరాత్రి వరకు అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు జరిగిందని, దాదాపు అభ్యర్ధుల ఖరారు పూర్తి అయిందని, త్వరలోనే విడుదల చేస్తామని ఆయన తెలిపారు.