వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నటి నటాషా రిచర్డ్సన్ మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

Natasha Richardson
న్యూయార్క్: ప్రముఖ నటి నటాషా రిచర్డ్సన్ కన్ను మూశారు. ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నటాషా మాన్ హట్టన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె తుది ఘడియల్లో భర్త, నటుడు లయామ్ నీసన్, కుమారులు మైకెల్ (13), డేనియల్ (12) ఆమె చెంతనే ఉన్నారు. ఆమె వయస్సు 45 ఏళ్లు.

నటాషా మృతికి ఆమె భర్త, కుమారులు, కుటుంబ సభ్యులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారని, ఈ దురదృష్టకరమైన సమయంలో తమ ప్రైవసీని కాపాడాలని వారు కోరారని కుటుంబ అధికార ప్రతినిధి అలన్ నీరోబ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్కార్ అవార్డు గ్రహీత వానేసా రెడ్ గ్రేవ్, డైరెక్టర్ టోనీ రిచర్డ్సన్ ల కూతురు నటాషా. మోంట్రియల్ కు 120 కిలోమీటర్ల దూరంలో గల మోంట్ ట్రెంబ్లాంట్ స్కై రిసార్టులో స్కయింగ్ పాఠం నేర్చుకుంటుండగా ఆమె ప్రమాదానికి గురయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X