డిజిపి యాదవ్ పై ఇసి వేటు
హైదరాబాద్: రాష్ట్ర డీజీపీ ఎస్.ఎస్.పి.యాదవ్‌పై కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. ప్రభుత్వం కొమ్ముగాస్తున్న కారణంపై డీజీపీ స్థాయి అధికారి మీద వేటు పడటం రాష్ట్ర చరిత్రలో ఇది మొదటిసారి. ఈ నెల 7న కర్నూలు విలేకరుల సమావేశంలో డీజీపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని పొగడ్తలతో ముంచెత్తిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతోప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ఐ.వి.సుబ్బారావు సంబంధిత వీడియో సీడీని తెప్పించుకుని స్వయంగా చూశారు. డీజీపీ యాదవ్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారించారు. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. మంగళవారం నివేదికను పరిశీలించిన ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని బుధవారం రాత్రి ఫ్యాక్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపించింది. తక్షణమే డీజీపీని బాధ్యతల నుంచి యాదవ్‌ను తొలగించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.
కొత్త డీజీపీ ఎంపిక కోసం ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కూడిన జాబితాను శుక్రవారం ఉదయం 11 గంటల కల్లా తనకు పంపాలని కోరింది. సీనియారిటీ, ఇతర నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. జాబితాలోంచి ఒక అధికారిని ఎన్నికలసంఘం డీజీపీగా నియమిస్తుంది. గురువారం మధ్యాహ్నంలోగా అర్హులైన ముగ్గురు ఐపీఎస్‌లతో జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంతరెడ్డిని కోరినట్లు సుబ్బారావు వెల్లడించారు.












Click it and Unblock the Notifications